Hut dwellers Initiation in Abdullahpurmet: గుడిసెలు వేసుకున్న వారు రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలలో రాష్ట్ర ప్రజాసంఘాల వేదిక కార్యదర్శి ఎస్.వీరయ్య మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీరు చేస్తున్న పోరాటం న్యాయమైందని, అన్నారు. ఈ భూమి ఎవరిజాగీరు కాదని.. ప్రభుత్వ భూమిపై పేదలకు హక్కుంటుందని అన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఆ భూమిలోనే గుడిసెలు వేసుకోవాలని, మీకు ఎల్లవేళలా మా మద్దతు ఉంటుందని తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు జాన్వెస్లీ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఆ భూమిని పేదలకు ఇచ్చేంతవరకు వదిలేది లేదని, హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు 60 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కావున తెలంగాణ ప్రభుత్వం 493జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పడాల యాదయ్య, సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: