ETV Bharat / state

భార్యను గొడ్డలితో నరికి.. 42రోజుల శిశువును నీటి సంపులో పడేసి భర్త దారుణ హత్య - Rangareddy Crime News

Husband killed wife and baby in Anajpur: 'నాన్నా.. నాన్నా.. అమ్మని కొట్టొద్దు. ప్లీజ్ నాన్నా తమ్మున్ని ఏం అనొద్దు' అంటూ ఆ రెండేళ్ల పాప గుక్కపెట్టి ఏడ్చింది. అయినా కనికరించని ఆ తండ్రి దుర్మార్గపు చర్యను చూసి ఆ చిన్నారి భీతిల్లింది. అక్కడే ఉంటే తననూ చంపేస్తాడేమోనన్న భయంతో వేగంగా అక్కడి నుంచి పరుగుపెట్టింది. పక్కింటి వాళ్ల దగ్గరికి వెళ్లి 'మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు. మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని తన కళ్ల ముందు జరిగిన ఘోరాన్ని చెప్పింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అనాజ్​పూర్​లో చోటుచేసుకుంది.

Husband killed wife and baby in Anajpur
Husband killed wife and baby in Anajpur
author img

By

Published : Mar 16, 2023, 12:42 PM IST

Husband killed wife baby in Anajpur: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ పీఎస్ పరిధిలోని అనాజ్​పూర్​లో తీవ్ర విషాదం నింపిన భార్య, నెలన్నర పసికందు హత్య కేసులో విషాదకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో భార్యతో అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచిన భర్తే కాలయముడిగా మారాడు. భార్యను, కొడుకు కర్కశంగా చంపాడు. రెండేళ్ల తన పాప ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిరాలకు చెందిన కందికంటి నర్సింగ్ రావు కోటమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య(28)కు 2018లో అనాజ్​పూర్​ గ్రామానికి చెందిన ఏర్పుల ధనరాజ్​తో వివాహం జరిపించారు. వీరికి రెండేళ్ల కూతురు ఆద్య, 42 రోజుల కుమారుడు క్రియాన్ష్ ఉన్నారు. కుమారుడు పుట్టినప్పటి నుంచి లావణ్య బండరావిరాలలోని తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి జరిగిన నాటి నుంచి ఏర్పుల ధనరాజ్ తన భార్య లావణ్యతో గొడవ పడుతూ అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు.

ఈ విషయంమై రెండు మూడు సార్లు పెద్దల సమక్షంలో మాట్లాడి సముదాయించారు. అయినా ధనరాజ్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే బుధవారం ధనరాజ్ బండరావిరాల వెళ్లి కొడుకుకు టీకా వేయించాలనే కారణం చెప్పి.. భార్య లావణ్యను ఇద్దరు పిల్లలను అనాజ్​పూర్​ గ్రామానికి తీసుకొచ్చాడు. అనాజ్​పూర్ వచ్చిన తర్వాత కట్నం గురించి లావణ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే.. ఆమె తలపైబీర్ బాటిల్​తో తలపై కొట్టి అనంతరం గొడ్డలితో నరికి హత్య చేశాడు.

"పెద్ద పాప ఆద్య ఇంటి నుంచి బయటకు వస్తేగానీ మాకు తెలియలేదు. అప్పటికే ధనరాజ్​ బైక్​పై వెళ్లిపోతున్నాడు.. అతని ఒంటిపై రక్తం మరకలు ఉన్నాయి. మేము అతన్ని ఏం జరిగిందని ప్రశ్నించాం.. అయినా మాకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు".- గ్రామస్థులు

"ఎంతో నమ్మకంగా మా ఇంటికి వచ్చి మా బిడ్డను తీసుకొచ్చాడు. బాబుకు సూది మందు వేయిస్తానని నమ్మబలికాడు. ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదు. నమ్మించి ప్రాణం తీశాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి".- మృతురాలి తల్లి

"ధన్​రాజ్​ అనే వ్యక్తి తన భార్య లావణ్య, 42 రోజులు వయస్సు ఉన్న బాబును చంపినట్లు మాకు ఫిర్యాదు వచ్చింది. అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించడం జరిగింది. భార్యను గొడ్డలి, బీరు సీసాలతో చంపినట్లు, శిశువును నీటి సంపులో పడేసి చంపినట్లు తెలుస్తోంది.".- పురుషోత్తం రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ

ఇవీ చదవండి:

కుటుంబ కలహాలు.. భార్య, పసికందును హత్యచేసిన భర్త

ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని కండక్టర్‌ ఆత్మహత్య

భౌ.. పెడుతున్న వీధి కుక్కలు.. రేబిస్​ లక్షణాలతో బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.