Husband Killed His Wife Riding Scooty in Rangareddy: స్కూటీపై వెళుతున్న భార్యను అడ్డగించి బండరాయితో కొట్టి భర్త హత్య(Wife Murder) చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలోని శాతవాహన నగర్‌కు చెందిన బాల కోటయ్య, శాలినికి 15 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Husband Killed his Wife with Stone : గత నాలుగు నెలలుగా భర్తతో విభేదించి.. శాలిని తన తల్లి ఇంటి వద్ద ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఆమె తన సోదరి ఇంటికి స్కూటీపై వెళుతుంది. ఆమె వెనుక భర్త వెంబడించి.. స్కూటీని అడ్డగించాడు. ఒక్కసారిగా ఆమె తలపై బండరాయితో కొట్టి హత్య(Husband Killed his Wife) చేశాడు. వెంటనే స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్త బాల కోటయ్య ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Farmers Fight Over Farm Path Video Viral : పొలం బాట విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి.. వీడియో వైరల్
Two Youngers Died in Road Accident at Keesara : కీసర పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులందరూ లాంగ్ డ్రైవ్ వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు, మరో యువతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరూ అల్వాల్ బొల్లారానికి చెందిన వారుగా గుర్తించారు.
Man Died in Bike Collision With Auto in Rangareddy : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ బాటసింగారంలోని పాత జాతీయ రహదారి వద్ద ఆటో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో మృతుడు మజీద్‌పూర్ గ్రామానికి చెందిన రాంచందర్‌గా పోలీసులు గుర్తించారు. ఇతని మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదానికి కొద్దిసేపటికి ముందే వరుసకు అన్నాతమ్ములైన మృతుడు రాంచందర్, ఆటో నడిపిన శ్రీశైలం మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారమే రాంచందర్ ద్విచక్ర వాహనాన్ని.. శ్రీశైలం ఆటోతో ఢీకొట్టి హత్య చేశాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జరగడం సర్వసాధారణమైపోయింది.