రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. షేక్ గబ్బార్, షేక్ ఇమ్రాన్లు డీసీఎం వాహనంలో వంద బస్తాల గుట్కా పాకెట్లను తరలిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సుమారు 30 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: 'నేను మీ హరీశ్ రావుని మాట్లాడుతున్నా.. ఆరోగ్యం ఎలా ఉంది'