గ్రామాల్లో, పట్టణాల్లోని నర్సరీల యజమానులు తప్పనిసరిగా నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్సులు పొందాలని ఉద్యాన అధికారి సునంద తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని హైతాబాద్ గ్రామంలోని పాలిహౌజ్‌లను ఆమె సందర్శించారు. రైతులు దర్శన్, శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహిస్తున్న పాలిహౌజ్‌లను పరిశీలించి వానాకాలంలో మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. ఎత్వర్ పల్లి గ్రామం మొయినాబాద్ మండలం లో రైతు శివరామ కృష్ణ పొలంలో డ్రిప్ పనితీరును పరిశీలించి అభినందించారు.
నాగరగుడ గ్రామ శివారు చేవెళ్ల మండలంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర నర్సరీని సందర్శించి.. నర్సరీ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి నర్సరీ యజమాని తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్స్ పొందాలని, రోజువారిగా మొక్కల అమ్మకాలను రిజిస్టరులో నమోదు చేయాలని తెలిపారు. మరింత విస్తృత స్థాయి అవగాహన కొరకు జిల్లాలో గల అన్ని నర్సరీల యాజమాన్యాలతో 27న కలెక్టర్ సమక్షంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్, డివిజన్ ఉద్యాన అధికారి స్వరూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్