HMDA: మార్కెట్‌లో రియల్ ఎస్టేట్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి పనికిరాని భూములను రైతుల నుంచి ల్యాండ్‌పూలింగ్ పద్ధతిన తీసుకొని ప్లాట్లుగా చేసి హెచ్ఎండీఏ విక్రయిస్తోంది. ఇప్పటికే కోకాపేట్, ఉప్పల్ భగాయత్ ప్లాట్లవేలానికి మంచి స్పందన రావడంతో మరికొన్ని ప్రాంతాల్లో భూముల వేలానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా తొర్రూరు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బహదూర్‌పల్లిలో నిర్వహించిన ప్రీ బిడ్డింగ్‌కి మంచి స్పందనరావడంతో నేటి నుంచి భూముల వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. హైదరాబాద్ బండ్లగూడ, ఖమ్మంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను వేలం వేయనున్నారు.
నేటి నుంచి 3రోజుల పాటు వేలం
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని తొర్రూర్‌లో 117 ఎకరాల్లో వెయ్యిప్లాట్ల అభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలివిడతగా 30 ఎకరాల్లోని 223 ప్లాట్లు అమ్మకానికి పెట్టింది. ఇక్కడ చదరపు గజం ప్రారంభ ధరను 20 వేలుగా నిర్ధరించిన అధికారులు.. ఒక్కో ప్లాట్‌కి లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం జరగనుంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ మున్సిపాల్టీలోని బహదూర్‌పల్లిలో 40ఎకరాల్లో 101ప్లాట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇక్కడ చదరపు గజం ప్రారంభ ధరను 25 వేలుగా నిర్ణయించారు. అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం పాట నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్‌తో 2,700 ఇళ్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించింది. వాటిలో కేవలం 500 ప్లాట్లు విక్రయించారు. మిగిలినవి వేలం పాట ద్వారా అమ్మబోతున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహలో భాగంగా 8 టవర్స్‌లోని ప్లాట్లను నేటి నుంచి హెచ్ఎండీఏ వేలంపాట ద్వారా విక్రయించనుంది.
పెద్దమొత్తం ఆదాయం
హెచ్ఎండీఏ చేపడుతున్న భూములు, ప్లాట్ల అమ్మకాల ద్వారా రిజిస్ట్రేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: