Direct hearings stopped in Courts: కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో న్యాయస్థానాల విధుల నిర్వహణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో తక్షణమే ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4 వరకు ఆన్లైన్లోనే కోర్టుల నిర్వహణ జరపాలని ఆదేశించింది.
హైకోర్టులో కూడా అన్ని బెంచ్‌లు ఆన్లైన్లోనే కేసుల విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా న్యాయాధికారులకు హైకోర్టు తెలిపింది.
ఇదీ చదవండి: ప్రారంభరోజే వాయిదా పడిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... ఎందుకంటే?