సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం
మృతదేహాలకు గాంధీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు నిపుణుల బృందం పోస్టుమార్టం నిర్వహించిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సేకరణకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొందని.. రీపోస్టుమార్టానికి ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందని అమికస్ క్యూరీ ప్రకాశ్ రెడ్డి అన్నారు.
రీపోస్టుమార్టానికే పరిమితం కావొద్దు
ఆధారాల సేకరణలో భాగంగా కేవలం రీపోస్టుమార్టానికి పరిమితం కాకుండా.. పోలీసుల కాల్ రికార్డులు, రిజిస్టర్లు, ఆయుధాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని హక్కుల సంఘాల తరఫు న్యాయవాది వ్రింద వాదించారు. అవన్నీ ఇప్పటికీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నందున.. ఆధారాలు లేకుండా చేసే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించకుండా.. ఆర్డీవోతో చేయించారని వాదించారు.
సీనియర్ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం
సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం.. రేపు సాయంత్రం ఐదు గంటల్లోపు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దిల్లీ ఎయిమ్స్ నుంచి ముగ్గురు అత్యంత సీనియర్ ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డు రీపోస్టుమార్టం చేయాలని స్పష్టం చేసింది. ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరించి.. నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
దిల్లీ ఎయిమ్స్‌కు లేఖ రాయండి
రీ పోస్టుమార్టం కోసం దిల్లీ ఎయిమ్స్‌కు లేఖ రాయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులు వచ్చేందుకు విమాన రవాణ సౌకర్యంతో పాటు.. హైదరాబాద్‌లో అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని గాంధీ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
ఆధారాలే కీలకమని వ్యాఖ్య
ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే ఆధారాలే కీలమని హైకోర్టు పేర్కొంది. ఆధారాలన్నీ సేకరించి భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను ఆదేశించింది. ఎన్కౌంటర్లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. బాలిస్టిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించాలని చెప్పింది. న్యాయం జరగటంతో పాటు... జరిగినట్లు కనిపించడం ముఖ్యమేనని రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ