రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్మించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా కూకట్పల్లి, మల్కాజిగిరి న్యాయస్థానాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
అనంతరం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ గార్డ్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు అభిషేక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు, పోలీసులు హాజరయ్యారు.