ETV Bharat / state

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గురువందనం - Guruvandan on October 2

రంగారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవ గురు వందనం సన్నాహక కార్యక్రమం బాలాపూర్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేశారు.

Guruvandan
గాంధీ గ్లోబల్
author img

By

Published : Sep 30, 2021, 4:59 AM IST

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గురువందనం

రంగారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవ గురు వందనం సన్నాహక కార్యక్రమం బాలాపూర్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2న విద్యారంగంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి అన్ని సబ్జెక్టులలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 108 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులకు గురువందనం పేరిట గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో సత్కరించనున్నట్లు సంస్థ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు.

విద్యాసేవ రత్న అవార్డుతో ఘనంగా సంప్రదాయబద్దంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువులు సన్మార్గంలో నడిపిస్తారని అలాంటి జాతి నిర్మాతలను సత్కరించాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీ జయంతి, గాంధీ ప్రకృతి వైద్యం, ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ప్రకృతి వైద్యులు కె.వై. చందర్ రావు, ఎన్​జీ పద్మతో సదస్సు ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సుస్థిర ఆరోగ్యానికై... మెరుగైన జీవన విధానం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన విజేతలకు బహుమతి ప్రధానం చేస్తామని తెలిపారు.

ఇదీచూడండి: Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.