ETV Bharat / state

ఇంటర్​ తప్పిన వారికి కంపార్ట్​మెంటలా? కండోనేషనా? - government thinking con-donation method inter failed students

ఇంటర్​లో తప్పిన విద్యార్థులకు ఈ సారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించరాదని ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ వారందరినీ కండోనేషన్​ లేదా కంపార్ట్​మెంటల్​ పాస్​ చేయాలా? అని తర్జనభర్జన పడుతోంది. ఈ విషయమై అన్ని రాష్ట్ర బోర్డులు సభ్యులుగా ఉండే కాబ్సే​ అధికారులతోనూ మాట్లాడుతున్నట్లు తెలిసింది.

government thinking how to pass inter failed students
ఇంటర్​ తప్పిన వారికి కంపార్ట్​మెంటలా? కండోనేషనా?
author img

By

Published : Jun 23, 2020, 7:14 AM IST

ఇంటర్​లో తప్పిన విద్యార్థులకు ఈ సారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించరాదని ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ వారందరినీ కండోనేషన్​ లేదా కంపార్ట్​మెంటల్​ పాస్​ చేయాలా? అని తర్జనభర్జన పడుతోంది. ఇప్పటివరకు తప్పినవారికి ఎఫ్​ అని ధ్రువపత్రాలపై రాస్తున్నారు. ఈసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోతుండటం వల్ల కంపార్ట్​మెంటల్​ పాస్​ అని ఇవ్వాలని యోచన. అంటే విద్యార్థికి ఎన్ని మార్కులొచ్చిన 35 మార్కులిచ్చి ఉత్తీర్ణుల్ని చేస్తారు.

ఇంకా కండోనేషన్​ పాస్(సీపీ) అని ఇవ్వాలన్నది మరో ఆలోచన. సర్టిఫికెట్​పై విద్యార్థికి వచ్చిన మార్కులే ఉంటాయి. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో వారు పాసైనట్లు లెక్క. అలా చేస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందాలనుకుంటే సమస్యలు వస్తాయని ఇంటర్​బోర్డు అధికారులు భావిస్తున్నారు. అన్ని రాష్ట్ర బోర్డులు సభ్యులుగా ఉండే కౌన్సిల్​ ఆఫ్​ బోర్డ్సు ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్(కాబ్సే)​ అధికారులతోనూ మాట్లాడుతున్నట్లు తెలిసింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.