రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం 38 విమానాల రాకపోకల జరగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దాదాపు 3200 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లారన్నారు. మంగళవారం నుంచి మరిన్నిటికి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారాని సీఎస్ తెలిపారు.
"శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విమానాశ్రయంలో టచింగ్ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తాం. ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్యసేతు యాప్ ఉండాలి."
-సోమేశ్ కుమార్, సీఎస్
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు