ETV Bharat / state

Theft in House: ఫ్రిడ్జ్​లో పాలు తాగి.. ఇంటిని గుల్ల చేసి..

Theft in House:మనవడి పుట్టినరోజుకని వెళ్తే ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లోని బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘరానా చోరీ హైదరాబాద్​లోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో జరిగింది.

Theft in House
ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో భారీ చోరీ
author img

By

Published : Jan 8, 2022, 4:07 PM IST

Theft in House: నగరంలో దోపీడి దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి బంగారు, వెండి, నగదును అపహరించారు. మనవడి పుట్టినరోజుకని వెళ్లి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దుండగులు. ఉదయాన్నే తిరిగొచ్చిన కుటుంబసభ్యులకు ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా చోరీ హైదరాబాద్​లోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో జరిగింది.

theft in yellammabanda: నగరంలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్​లో నివసించే పద్మ ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మనవడి పుట్టిన రోజుకని శుక్రవారం మెహదీపట్నంలో ఉండే పెద్దకూతురు ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఈ రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో పెళ్లి కోసం దాచిన 8 తులాల బంగారు, 30 తులాల వెండి, రూ.20 వేలు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితురాలు పద్మ పోలీసుల ఎదుట వాపోయింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఫ్రిడ్జ్​లో పాలను వేడి చేసుకుని తాగి.. మరీ ఇంట్లోని సొమ్మును ఎత్తుకెళ్లారని బాధితురాలి బంధువు మహేశ్​ తెలిపారు.

పోలీసులకు సమాచారం ఇవ్వండి

సంక్రాంతికి ఊర్లకు వెళ్లేవారు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకూడదని సూచించారు. కొవిడ్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో పండగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.