హైదరాబాద్ నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక వైదేహినగర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఓ భారీ షెడ్‌ను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూల్చేస్తుండగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశారు.
కొంతకాలంగా రిజిస్ట్రేషన్ సమస్య
గత కొంతకాలంగా బీఎన్‌రెడ్డి నగర్లో రిజిస్ట్రేషన్ సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమస్య లేకుంటే తాము అనుమతులు తీసుకునే వారిమని స్థానికులు తెలిపారు.
షెడ్ నిర్మించకముందే పనులను ఆపితే నిర్మాణం చేసేవాళ్లం కాదని కాలనీ వాసులు అన్నారు. షెడ్ నిర్మాణం పూర్తి అయ్యాక కూలగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. జీహెచ్ఎంసీ డౌన్ డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. కాలనీ వాసులకు, అధికారులకు మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
కూల్చివేయడం దారుణం: స్థానిక కార్పొరేటర్
వైదేహినగర్ కాలనీ వాసులకు స్థానిక కార్పొరేటర్ మద్దతుగా నిలిచారు. అధికారులు కావాలనే షెడ్‌ను తొలగించడం దారుణం అన్నారు. గతంలో కూడా బీఎన్‌రెడ్డి నగర్లో రిజిస్ట్రేషన్ సమస్యలు తీరుస్తామని మంత్రులు చెప్పినా ఇంతవరకు ఆ ఊసే లేదని మండిపడ్డారు. మంత్రుల మాటలు కేవలం మా హామీలకే పరిమితమయ్యాయని ఆరోపించారు.
ఆదేశాలతోనే కూల్చేస్తున్నాం: జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతోనే షెడ్ నిర్మాణం కూల్చివేయడానికి వచ్చామని జీహెచ్ఎంసీ ఎన్పోర్స్మెంట్ అధికారి తెలిపారు. తమకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. కేవలం ఉన్నతాధికారుల నుంచి కూల్చివేయాలని ఆదేశాలు వచ్చినట్లు స్థానికులకు వివరించారు.
ఇదీ చూడండి: