రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని వీడీఐటీలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగే నీట్ పరీక్షకు విద్యార్థులకు ఉదయం 11గంటల నుంచే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల సమయంలో విద్యార్థులను తనిఖీచేసి లోనికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు తలెత్తకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులతో కలిసి అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా మొదలైన నీట్ ఆర్హత పరీక్ష