రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో సంగీత దర్శకుడు ఘంటసాల 97వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మధుర గానంతో ఆనాటి నుంచి ఈనాటి వారిని సైతం ఆకట్టుకున్న ఘంటసాల కృషిని పలువురు సంగీత ప్రియులను కొనియాడారు. సంగీత ప్రియులు ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొని అలనాటి మధుర గేయాలను ఆలపించారు.
ఘంటసాల సంగీతం గురించి చేసిన కృషిని ఈనాటి విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదని పలువురు అన్నారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యువజన సంఘం సభ్యులు, సంగీత ప్రియులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం