ETV Bharat / state

లక్ష్య సాధన ఫౌండేషన్​లో గాయత్రీ మహా యజ్ఞం

author img

By

Published : Nov 30, 2020, 7:39 PM IST

కార్తిక పౌర్ణమి సందర్భంగా చిలుకూరు సమీపంలోని లక్ష్య సాధన ఫౌండేషన్​లో గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. సమాజహితం కోసం ఈ యజ్ఞం చేస్తున్నట్లు వేద బ్రహ్మ శ్రీధరాచార్యులు పేర్కొన్నారు. వేదాలు పుట్టిన భారతదేశంలో కరోనా వైరస్​ లాంటి మహమ్మారి.. ప్రజలను పీడించడం బాధాకరమని వెల్లడించారు. వీటన్నింటి నుంచి ప్రజలను రక్షించాలని గాయత్రీ యజ్ఞం చేస్తున్నట్లు తెలిపారు.

gayathri maha yagnam at lakshya sadhana foundation
లక్ష్య సాధన ఫౌండేషన్​లో గాయత్రీ మహా యజ్ఞం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ సమీపంలో లక్ష్య సాధన ఫౌండేషన్​లో కార్తిక పౌర్ణమి సందర్భంగా గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. కలికాలంలో అనేక మానవజాతి నాశనకరమైన రోగాలు సంభవించాయని, ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వ్యాధి విలయతాండవం చేస్తుండగా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని మొక్కుతూ ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు వేద బ్రహ్మ శ్రీధరాచార్యులు పేర్కొన్నారు.

ప్రతి పౌర్ణమికి "లోకాః సమస్తాః సుఖినోభవంతు" అనే సూక్తిని నిజం చేస్తూ ప్రపంచ శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహించుకుందామని వేద బ్రహ్మ కోరారు.

ఇదీ చదవండి: గౌతమేశ్వరస్వామి ఆలయానికి కార్తిక శోభ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.