బంధువులైనా, స్నేహితులైనా... ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులే. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి ఎంపీటీసీ అభ్యర్థులుగా తోడి కోడళ్లు పోటీ చేస్తున్నారు. తెరాస తరఫున నళిని, మహబూబ్నగర్ జడ్పీ వైస్ ఛైర్మన్ నవీన్ రెడ్డి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాధవి బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తోపులాటలతో ప్రారంభమై కర్రలతో దాడి చేసుకునే దాకా వచ్చింది పరిస్థితి. పోలీసులు రంగంలోకి దిగి శాంతింపజేశారు.
ఇవీ చూడండి: చివరి రోజున జోరుగా ప్రచారాలు