రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడలోని బైరంఖాన్ చెరువులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగాయి. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల నుంచి గణనాథులు గంగమ్మ ఒడికి తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిమజ్జన స్థలం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందిరినీ అలరించాయి. కళాకారుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఇదీచూడండి:బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!