ETV Bharat / state

VIJAYA DAIRY: రావిర్యాలలో విజయ డైరీ మెగా ప్రాజెక్టు.. నేడే శంకుస్థాపన - telangana news

రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డైరీని భారీ స్థాయిలో నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. రూ. 246కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద మంత్రి తలసాని.. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

vijaya dairy in raviryala
రావిర్యాల విజయ డైరీ
author img

By

Published : Sep 3, 2021, 7:01 AM IST

పాడిపరిశ్రమకు మరింత ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.246 కోట్లతో విజయ మెగా డెయిరీ ప్రాజెక్టును చేపడుతోంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద 32 ఎకరాల్లో నిర్మించనున్న దీనికి ఈ రోజు భూమిపూజ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. నెయ్యితో తయారు చేసిన 13రకాల స్వీట్ల మార్కెటింగ్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త ప్లాంటులో 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల వరకు పాల శుద్ధిప్లాంటు, 5 వేల లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఐస్‌ క్రీం ప్లాంటు, రోజుకు లక్ష లీటర్ల టెట్రా పాల ప్యాకెట్‌ ఉత్పత్తి ప్లాంటులతో పాటు నెయ్యి, బటర్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

2014లో విజయ డెయిరీ టర్నోవర్‌ రూ.310 కోట్లు కాగా అది ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందని మంత్రి తలసాని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో లాభాలబాట పట్టిందని చెప్పారు. ‘విజయ’ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి ప్రస్తుతం 600గా ఉన్న విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రారంభిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ విజయ డెయిరీ ద్వారా 28 రకాలకు పైగా ఉత్పత్తుల తయారీ, విక్రయాలు జరుగుతున్నాయని.. మున్ముందు వాటిని 50కి పెంచుతామని తలసాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CM KCR: ఆ ముగ్గురిని కలిశాకే హైదరాబాద్​కు సీఎం కేసీఆర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.