Devender Goud birthday celebrations: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో తన నివాసంలో మాజీ హోంశాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యులు దేవేందర్ గౌడ్ తన 70వ జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరం, ఉచిత దంత వైద్య శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవేందర్ గౌడ్ అభిమానులు, కార్యకర్తలు వచ్చి ఆయనను పుష్పగుచ్చాలతో, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశానని, అప్పటి తరం వేరు ఇప్పటి తరం వేరని, తనకు పుస్తకాలు చదివే అలవాటు ఉందని, మానవ జీవితంలో ఎప్పుడు లేనటువంటి మార్పులు గత 20 సంవత్సరాలలో చూశానని దేవేందర్ గౌడ్ అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని చూడబోతున్నామని, మనము ఏ స్థాయిలో ఉన్న ఏ కార్యక్రమమైనా.. ఒక దైవ కార్యక్రమంగా నిర్వహించాలని తను అలా చేసి గ్రామీణ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు నేను ఎదిగానన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని అయినా మోక్కవోని దీక్షతో సాధించగలిగానని తెలిపారు.
ఏలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గం ఉంటుందని భయపడకుండా ప్రతి ఒక్కరు జీవితంలో ముందుకు సాగాలని కోరారు. ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచి సమాజ సేవ చేసే దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని దేవేందర్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.
"నేటి సమాజం బాగా అభివృద్ధి చెందుతోంది. అప్పటి తరం వేరు, ఇప్పటి తరం వేరు. ఆర్టిఫిషియల్ ఇంటలిజేన్స్ వంటి నూతన సాంకేతికతలు మానవ జీవితంలో భాగంగా మారిపోతున్నాయి. మానవ జీవితంలో ఎప్పుడు లేనటువంటి మార్పులు గత 15, 20 సంవత్సరాలలో చూశాను. భవిష్యత్తులో మరిన్ని చూడబోతున్నాము. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాను. మనము ఏ స్థాయిలో ఉన్న ఏదైనా కార్యక్రమాన్ని.. ఒక దైవ కార్యక్రమంగా నిర్వహించాలి. నేను అలా చేసి గ్రామీణ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ఎదిగాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో సాధించగలిగాను. నా అనుభవంలో నేర్చుకుందేమిటంటే ఏలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గం ఉంటుంది. సమస్యలకు భయపడకుండా ప్రతి ఒక్కరు జీవితంలో ముందుకు సాగాలి."- దేవేందర్ గౌడ్ మాజీ హోంమంత్రి
ఇవీ చదవండి: