ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ వద్ద లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్​ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 8, 2019, 5:17 PM IST

Updated : Jul 8, 2019, 8:44 PM IST

రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ వద్ద ఘోర ప్రమాదం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ పట్టణం సమీపంలోని మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్​ ఖలీల్​కు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు వరంగల్​ జిల్లా మట్టువడా పీఎస్​లో హెడ్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్​, అతని భార్య విజయలక్ష్మి, కొడుకు శాంతన్​​, బావ రాజుగా పోలీసులు గుర్తించారు. కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకుని వస్తుండగా మేడిగడ్డ వద్ద మలుపు తిరుగుతున్న లారీని వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

Last Updated : Jul 8, 2019, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.