కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అల్వాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య మృతి చెందడం వల్ల కుమార్తె, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. తరచూ తండ్రి వేధిస్తుండడం వల్ల కూతురు బంధువుల ఇంటికి వెళ్లింది. తండ్రి వేధింపుల గురించి ఆమె ఎవరికీ చెప్పలేదు. కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురించి... అమ్మాయి చదివే పాఠశాలలోని ఉపాధ్యాయులకు తెలిపింది. ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఇవీ చూడండి: పాతనోట్లు ఇస్తామంటూ.. కొత్తనోట్లు కొట్టేశారు...