రంగారెడ్డి జిల్లా యాచారం ఎస్సై వెంకటయ్య వేధింపుల నుంచి తమను కాపాడాలంటూ ఓ రైతు దంపతులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తమ అన్నదమ్ముల మధ్య ఉన్న భూవివాదాన్ని పరిష్కరించమని పోలీసులను ఆశ్రయిస్తే... తన రెండు ఎకరాల భూమిని ఎస్సై తనకు అమ్మమని బలవంతం చేస్తున్నాడని కిషన్ పల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు పాల వెంకటయ్య ఫిర్యాదులో ఆరోపించారు. అందుకు నిరాకరించిన తనను బూటు కాళ్లతో తన్ని, అసభ్య పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టి, కోర్టు నుంచి వచ్చిన బెయిల్‌ను రద్దు చేయించి తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. ఎస్సై నుంచి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రైతు దంపతులు డీజీపీని వేడుకున్నారు.
ఇవీ చూడండి: 'వ్యక్తిగత వివరాలు, ఫొటోలు భద్రంగా ఉంచుకోవాలి'