రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తులకు గడువును ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఈ మేరకు పేర్కొంది.
డాక్యుమెంట్ల అప్లోడ్తోపాటు నిర్ణీత ఫార్మాట్లలో దరఖాస్తులు గడువులోపు అందించాలని తెలిపింది. వీసా ఫీజుతోపాటు ఒక వైపు విమాన ప్రయాణ ఛార్జీలు, 20 లక్షల ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని అర్హులు ఉపయోగించుకోవాలని కోరింది.
ఇదీ చూడండి: బయో బియ్యం అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు