ETV Bharat / state

FRIENDSHIP DAY: మీ జీవితంలో అలాంటి ఫ్రెండ్స్​ ఉన్నారా.? - friendship day special

ఫ్రెండ్​షిప్​.. హలో అంటూ కరచాలనంతో మొదలై.. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని ఏరా, బాబాయ్​, మామ అనేంతవరకు పోతుంది. ఆ పిలుపుల్లోనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత స్నేహం ఉందనేది అర్థమవుతుంది. తల్లిదండ్రులను దేవుడు ఇస్తే.. స్నేహితులను మనమే సంపాదించుకోవాలి అంటారు. అలా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చివరి మజిలీ వరకు మన జీవితంలో ఎంతో మంది తారసపడతారు. అందులో కొందరు మాత్రమే కనెక్ట్​ అవుతారు. వాళ్లే మన స్నేహితులు.

FRIENDSHIP DAY
ఫ్రెండ్​షిప్​ డే 2021
author img

By

Published : Aug 1, 2021, 1:41 PM IST

తల్లి, తండ్రి, తోబుట్టువులు ఇలా ప్రతి ఒక్కరి కోసం ఒక రోజంటూ ఉంది. అలాగే మన జీవితంలో చెరగని ముద్ర వేసే స్నేహితుల కోసం కూడా ఒకరోజును ప్రతిపాదిస్తూ ప్రతి ఏటా ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్​షిప్​ డేగా జరుపుకుంటున్నాం. సో... ఈరోజే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం..

అల్లరి చేష్టలు సహజం

మనం చెప్పే ప్రతి కథనీ వినేవాడు ఫ్రెండ్​.. కానీ మనం చెప్పే ప్రతీ కథలో ఉండేవాడే బెస్ట్​ ఫ్రెండ్​. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు.. కానీ తన గురించి పూర్తిగా తెలిసినవాడు.. తెలుసుకునేవాడు.. తన మంచీచెడు ఆలోచించేవాడు ఒక్కడే ఉంటాడు. వాడే బెస్ట్​ఫ్రెండ్​. మనం చేసే ప్రతి చిలిపి పనిలోనూ తోడుంటాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో తరగతులు బోర్​ కొడితే.. బంక్​ కొట్టి సినిమాకు వెళ్దామా మామా అంటే.. సరేరా మామా అనే వాళ్లే కానీ వద్దు చదువుకుందాం అనే ఒక్క ఫ్రెండ్​ను చూపించండి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతటి గొప్పవాళ్ల లైఫ్​లో అయినా ఇలాంటి అల్లరి చేష్టలు వారి గతంలో సహజం.

అమ్మ ప్రేమలా వెలకట్టలేనిది

మనిషి సృష్టించుకున్న ప్రతి బంధంలోనూ కుల, మతాల ప్రస్తావన ఉంటుంది. కానీ ఒక్క స్నేహంలోనే అలాంటి వాటికి తావుండదు. నువ్వు ఎక్కడినుంచి వచ్చావు అనేది అనవసరం.. నువ్వేంటి అన్నదాంతో సంబంధం లేదు. తల్లి ప్రేమలో ఎంత స్వచ్ఛత, నిస్వార్థం ఉంటుందో.. అంతటి స్థాయి అనుభూతిని ప్రతి ఒక్కరూ తమ స్నేహంలో చవిచూస్తారు. ఆపదలో ఉన్నావని తెలిస్తే చాలు మరుక్షణం నీ ముందుంటారు.

నెలకోసారైనా

వాట్సప్​, ఫేస్​బుక్ ఇంకా రాని రోజుల్లో ఫ్రెండ్​ షి​ప్​ డేకి 2 రోజుల ముందే మన స్నేహితుల అభిరుచికి తగినట్లుగా గ్రీటింగ్​ కార్డులు, గిఫ్ట్స్ ​ కొని వాళ్లని సర్​ప్రైజ్​ చేసేవాళ్లం. ఫ్రెండ్​షిప్ బ్యాండ్లు కట్టుకునేవాళ్లం. వారి కళ్లల్లో అనుభూతిని మనసారా ​​ఆస్వాదించేవాళ్లం. కానీ ఇప్పుడు కాలం మారింది. గ్రీటింగ్​ కార్డ్స్​ మరుగున పడ్డాయి. దానికి బదులుగా సోషల్​ మీడియాల్లో తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు. ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానాల్లో ఉన్నా.. తమ వీలును చూసుకొని దగ్గర్లో ఉన్నవాళ్లయితే నెలకోసారి.. దూరంగా ఉండే వాళ్లయితే ఏడాదికోసారి గెట్​ టు గెదర్ ఏర్పాటు చేసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.

ఏదేమైనా ట్రెండ్లు ఎన్ని మారినా ఫ్రెండ్స్​ మాత్రం నెవర్​ ఎండ్​. సంతోషంలో ఉన్నప్పుడు చీర్స్​ కొట్టేవాడే కాదు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను చిల్​ చేసేవాడే అసలైన ఫ్రెండ్​. మరి అలాంటి స్నేహితులు మీ జీవితంలో కూడా ఉండాలని ఆశిస్తూ హ్యాపీ ఫ్రెండ్​ షిప్​ డే..

ఇదీ చదవండి: TRUE FRIEND: ఎన్ని మాటలు పడినా మీతో దోస్తీ వదలనిది "వాడే.."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.