ETV Bharat / state

విజ్ఞానంతోనే కుల వివక్ష అంతం: సబితా ఇంద్రారెడ్డి - కొత్తూర్

విద్య, విజ్ఞానంతోనే కుల వివక్షను రూపుమాపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ప్రసంగించారు.కుల, మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.అనంతరం మంత్రి చేతుల మీదుగా రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు.

Eduacation minister paryatana in rangareddy
విజ్ఞానంతోనే కుల వివక్ష అంతం : సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : Oct 1, 2020, 7:57 AM IST

విద్యతోనే కుల వివక్షను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం సిద్దాపూర్​లో బుధవారం పర్యటించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కులాల వారిగా ప్రగతిని సాధించేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

కుల, మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కోసమే తాము పనిచేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో 556 మండలాల్లో 52 కోట్లతో అట్రాసిటీ కేసులు పరిష్కారించామన్నారు. కులవివక్షను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం మంత్రి చేతుల మీదుగా రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి అమోయి కుమార్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.