ETV Bharat / state

భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం - దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం వార్తలు

హైదరాబాద్ నగరానికి నిలిచే మరో ఐకాన్ దుర్గం చెరువు తీగల వంతెనను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. రూ.184 కోట్లతో నిర్మించిన‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు.. రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు రూ. 150 కోట్లతో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్​లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం

author img

By

Published : Sep 25, 2020, 8:37 PM IST

భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం

హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచేలా దుర్గం చెరువుపై నిర్మించిన.. తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. రూ. 184 కోట్ల వ్యయంతో.. 754.38 మీటర్ల పొడవున నిర్మించిన వంతెనను.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, శ్రీనివాస్​ గౌడ్​, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​, అధికారులు పాల్గొన్నారు.

ఈ వంతెనతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గింది. రంగురంగుల విద్యుత్ కాంతులతో.. హైదరాబాద్‌లో మొట్టమొదటి హ్యాంగింగ్ బ్రిడ్జిగా నిలిచింది. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో చేపట్టిన వంతెన నిర్మాణంలో 13 ఫౌండేషన్లతో పాటు ఈ వంతెనకు 40 వేల ఎల్​ఈడీ లైట్లు అమర్చారు.

పర్యాటకాభివృద్ధిలో భాగంగా.. శని, ఆదివారాల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతించడం లేదని జీహెచ్​ఎంసీ తెలిపింది. ఆయా రోజుల్లో ప్రజలు కాలినడకన బ్రిడ్జిపై ప్రయాణిస్తూ నగర అందాలను తిలకిస్తూ, చక్కని అనుభూతి పొందేందుకు జీహెచ్​ఎంసీ.. ఈ నిర్ణయం తీసుకుంది. ప్రారంభోత్సవం సందర్భంగా బాణా సంచా ప్రదర్శన ఆకట్టుకుంది.

ఇదీ చదవండి: ఆకట్టుకుంటోన్న తీగల వంతెన!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.