రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ బాలాపూర్‌లో గతేడాది కురిసిన భారీ వర్షానికి ఇళ్లు కూలి నష్టపోయిన బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇళ్లు బాగా దెబ్బతిన్న 23మందికి ఒక్కొక్కరికి రూ.95,100 చెక్కులను, పాక్షికంగా కూలిన 28 మందికి ఒక్కొక్కరికి రూ.3,200 చెక్కులను అందజేశారు. రూ.47లక్షల విలువ చేసే మెషీన్‌ను ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాదితో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, బాలాపూర్ మండలం డిప్యూటీ తహసీల్దార్ సిబ్బంది, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఉస్మాన్ నగర్లో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీ వచ్చేటట్లు చేస్తామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: జర్నలిస్టుల కోసం హెల్ప్‌డెస్క్... రేపటి నుంచే అందుబాటులోకి..