రంగారెడ్డి జిల్లా జల్పల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలం కబ్జాకు గురవుతుందని ఆరోపిస్తూ పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నాకు దిగారు. స్థలాన్ని కబ్జా కాకుండా చూసి.. అర్హులకు అందేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 62లోని భూమిని ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. అయితే ఈ భూమి పక్కవారు స్థలాన్ని కబ్జా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా చూసి అర్హులకు అందేటట్లు చూడాలని కోరారు.
సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నాలో స్థానిక నేత దానయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.బాబు, బి.రవి, శంకర్ రావు, రమేష్, రాము, ఇంద్ర, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బాలీవుడ్‌కు 'డ్రగ్స్' మరక.. గుట్టు బయటపెడతానన్న కంగన