విజయవాడ జాతీయ రహదారిపై చెక్పోస్టులని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, కొత్తగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్(Lock down) పటిష్టంగా అమలవుతుందని డీజీపీ పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24/7 కష్టపడి లాక్డౌన్(Lock down) ను కఠినంగా అమలు చేస్తున్నారని అభినందించారు.
ఎవరైనా రూల్స్ అతిక్రమించి బయటకు వస్తే వారి వాహనాలు జప్తు చేస్తామని… వాటిని లాక్డౌన్(Lock down) అనంతరం కోర్ట్ నుంచి తీసుకోవాలని సూచించారు. కాలనీల్లో కూడా యువకులు, పిల్లలు బయటకు వచ్చిక్రికెట్ ఆడకూడదని కాలనీ అసోసియేషన్లకు అవగాహన కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి: Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు