ETV Bharat / state

నందిహిల్స్​లో క్రికెట్​ అకాడమీని ప్రారంభించిన యూసఫ్​

మీర్​పేట్​ పరిధిలోని నందిహిల్స్​లో క్రికెట్​ అకాడమీ ఆఫ్​ పఠాన్స్​ను క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​ ప్రారంభించారు. ఔత్సాహికులకు ఈ అకాడమీ ప్రపంచ స్థాయి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ​

cricket academy of pathans
క్రికెట్​ అకాడమీ ఆఫ్​ పఠాన్స్
author img

By

Published : Feb 24, 2021, 9:41 AM IST

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ పరిధిలోని నందిహిల్స్​లో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్(సీఏపీ)ను క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రారంభించారు. అకాడమీని ప్రారంభించడం ఆనందంగా ఉందని, యువ క్రికెటర్లకు ప్రపంచ స్థాయి శిక్షణను సీఏపీ అందించనుందని యూసఫ్​ పేర్కొన్నారు.

అత్యుత్తమ శ్రేణి బౌలింగ్, మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికతతో క్రీడాకారులు ప్రయోజనం పొందగలరని యూసఫ్​ ధీమా వ్యక్తం చేశారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించి వారికి మెళకువలు నేర్పాలనే లక్ష్యంతో క్రికెట్ అకాడమీని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించినట్లు చెప్పారు.

సీఏపీతో ప్రపంచ స్థాయి శిక్షణ: యూసఫ్​ పఠాన్​

ఇదీ చదవండి: పెట్రోల్​ ఎఫెక్ట్​: వీలైతే వాకింగ్​...​ లేదంటే సైక్లింగ్...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.