ETV Bharat / state

సీఐటీయూ నేతలను తక్షణమే విడుదల చేయాలి: సీపీఎం నేత శ్రీనివాస్ నాయక్ - తెలంగాణ తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా బాలాపూర్​లో​ సీఐటీయూ నేతలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. సీపీయం పార్టీ సీనియర్ నేత ఎస్. వీరయ్యతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. పాదయాత్రను అడ్డుకోవటాన్ని నిరసిస్తూ యాచారం మండల కేంద్రంలో సీపీఎం, వాటి అనుబంధ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించాయి.

cpm leaders
సీఐటీయూ
author img

By

Published : Sep 11, 2021, 5:21 PM IST

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా సీఐటీయూ నేతలు చేపట్టిన పాదయాత్రను బాలాపూర్​లో పోలీసులు అడ్డుకోవటంపై సీపీఎం పార్టీ శ్రేణులు ఆగ్రహం వక్తం చేశాయి. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫలితంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంచాల మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు.

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణిచివేయలేరని స్పష్టం చేశారు. అరెస్ట్​ అయిన ఎస్ వీరయ్యతో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: గుజరాత్​ రాజకీయాల్లో అనూహ్య మలుపు.. తదుపరి సీఎం ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.