ETV Bharat / state

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు: సీపీ - Rachakonda Police Commissioner Mahesh Bhagwat

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిందేకు తగిన ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ తరుణంలో సరూర్​ నగర్ విక్టోరియా మెమోరియల్, ఇండోర్ స్టేడియం, హయత్ నగర్​ వర్డ్ & డీడ్ స్కూల్, తదితర ప్రాంతాల్లోని ఎన్నికల పోలింగ్​ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

cp-mahesh-bhagwat-said-arrange-for-the-ghmc-elections-to-take-place-peacefully
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు: సీపీ
author img

By

Published : Nov 28, 2020, 7:22 PM IST

ప్రశాంత వాతావరణంలో జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. సరూర్​ నగర్ విక్టోరియా మెమోరియల్, ఇండోర్ స్టేడియం, హయత్ నగర్​ వర్డ్ & డీడ్ స్కూల్, రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, నాచారం శ్రీచైతన్య హైస్కూల్లో లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను మహేష్ భగవత్ పరిశీలించారు.

cp-mahesh-bhagwat-said-arrange-for-the-ghmc-elections-to-take-place-peacefully
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు: సీపీ

ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పోలింగ్, లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ అన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం ముగుస్తుందని.. ఎన్నికల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోవాలని మహేశ్ భగవత్ సూచించారు.

ఇదీ చూడండి: ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.