ETV Bharat / state

mahesh bhagwat: హోంగార్డుకు సీపీ సత్కారం - ఆరుగురిని కాపాడిన హోంగార్డు

యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ కోరారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ సైకాలజీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 040-48214800 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లేక్ ఔట్ పోస్ట్​లో ఇప్పటి వరకు ఆరుగురు ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తే కాపాడినట్లు సీపీ వివరించారు.​

cp mahesh bhagwat
mahesh bhagwat: హోంగార్డుకు సీపీ సత్కారం
author img

By

Published : May 29, 2021, 7:35 PM IST

హైదరాబాద్ సరూర్ నగర్ లేక్ ఔట్ పోస్ట్​(Saroornagar Lake Outpost)లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తున్నారని… ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఆరుగురిని కాపాడమని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ (rachakonda cp mahesh bhagwat) తెలిపారు. లేక్ ఔట్ పోస్టులో పనిచేస్తున్న హోంగార్డ్ ఈశ్వరయ్య ఆరుగురిని కాపాడారని సీపీ వెల్లడించారు.

నిన్న(శుక్రవారం) శివ కుమార్(26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి దూకగా…ఆ వ్యక్తిని సైతం రక్షించారని అన్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే వారి కోసం ఓ సైకాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మహేశ్​ భగవత్ చెప్పారు. ఈ కేంద్రం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 040-48214800 కాల్ సెంటర్ ద్వారా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కోసం హోంగార్డ్ ఈశ్వరయ్య పేరును ప్రభుత్వానికి పంపుతామని తెలిపిన సీపీ… ఈశ్వరయ్యను శాలువాతో సత్కరించి రివార్డును అందజేశారు.

ఇదీ చూడండి: Weather Report : రాష్ట్రంలో మూడ్రోజులు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.