రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నెల 16న నిర్వహించే టీకా పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోఠిలోని శీతలీకరణ కేంద్రం నుంచి టీకాలను ఇవాళ జిల్లాలకు రవాణా చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు 2,370 డోసులు, రంగారెడ్డికి 1,190, నిర్మల్‌కు 1,340, మంచిర్యాలకు 460 డోసులు పంపించారు.
తొలిరోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షలమంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. వైద్య సిబ్బంది వారంలో నాలుగు రోజులు కొవిడ్ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ ఉంటుంది.