ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలతో పండుగలు జరుపుకోవాలి'

కొవిడ్ కట్టడి కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రెవెన్యూ అధికారులు సూచించారు. కేసులు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలక పరిధిలోని ఎర్రకుంటలో అధికారులు సమావేశం నిర్వహించారు.

Covid awareness programme, rangareddy dist news,  jalpally
జల్​పల్లి పురపాలికలో అధికారుల సమావేశం
author img

By

Published : Mar 28, 2021, 8:03 PM IST

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంటలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రజానిధులు సమావేశం నిర్వహించారు.

కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడుతూ.. భౌతిక దూరం తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, బాలాపూర్ డిప్యూటీ తహసీల్దార్, పహడి షరీఫ్ పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఉచిత నేత్ర వైద్య శిబిరాన్నిప్రారంభించిన మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.