హైదరాబాద్ కార్పొరేషన్ మన్సూరాబాద్ డివిజన్ త్యాగరాయనగర్ రహదార్లకు మోక్షం లభించింది . మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రహదారి పనులకు భూమి పూజ చేశారు. త్యాగరాయనగర్ మెయిన్ రోడ్డు, అపార్ట్‌మెంట్స్ వీధి రోడ్డుకు కలిపి రూ. 75లక్షల విలువైన పనులు ప్రారంభించారు .
ఒకనెల రోజుల లోపే ఈ రహదారి పనులు పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తామన్నారు . ఎన్నికల సమయయంలో త్యాగరాయనగర్, బాలాజీనగర్, ఆదిత్యా నగర్ కాలనీలు దత్త తీసుకుని పనులు చేస్తానన్న హామీ 80శాతం పూర్తి చేశానని కార్పొరేటర్ నరసింహారెడ్డి చెప్పారు. మిగిలిన పనులు కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు . దశాబ్ద కాలంగా రహదార్లు, డ్రైనేజీ లేక ఈ కాలనీలు ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డ్రైనేజీల నిర్వహణలో కాలనీ వాసులు సహకరించాలన్నారు . చెత్త వేయవద్దని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాలనీ వాసులకు కార్పొరేటర్ నరసింహారెడ్డి సూచించారు.
ప్రజల ఇబ్బందులు గుర్తించి కార్పొరేషన్ అధికారులను ఒప్పించి నిధులు విడుదల చేయించిన కార్పొరేటర్‌ను స్థానికులు శాలువాతో సత్కరించారు .