రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు బుధవారం నిర్ధరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. మొయినాబాద్ మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. ముషీరాబాద్‌లోని ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతనితో పాటు తన సన్నిహితులైన ముగ్గురికి పాజిటివ్ అని నిర్ధరణ అయ్యింది.
ఇదీ చదవండి: 'మైలురాయిని మంచి కోసం ఉపయోగించిన సామ్'