రక్తపోటు ఉందన్న విషయాన్ని చెప్పలేదంటూ... ఆరోగ్య బీమాను తిరస్కరించిన ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీరును వినియోగదారుల కమిషన్(Consumer Commission news) తప్పు పట్టింది. బాధితుడికి రూ.2లక్షలు జరిమానా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా పసుమాముల గ్రామానికి చెందిన చామర్తి శివరామకృష్ణ.... రేలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో గతంలో పాలసీ తీసుకున్నారు. దీని కింద కుటుంబసభ్యులకు వైద్యం, ఇతర ఖర్చులు వర్తించేలా రూ.17,701 ప్రీమియం చెల్లించారు. అనంతరం... ఆయన అనారోగ్యానికి గురికాకాగా... ఆస్పత్రిలో చేరాడు. నగదు రహిత చికిత్సకు బీమా క్లెయిం కోసం బీమా సంస్థకు సమాచారం అందించారు.
పరిహారం చెల్లించాలని ఆదేశం
ఆస్పత్రి ఖర్చులు రూ.3.5 లక్షలు ఖర్చుకాగా... డబ్బులు ఇవ్వాలని బాధితుడు సంస్థను కోరారు. కాగా సంస్థ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. పాలసీదారు తనకు హైపర్‌టెన్షన్ ఉందన్న విషయాన్ని దాచిపెట్టారంటూ కారణం తెలిపింది. దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను(consumer court case status) ఆశ్రయించగా... పాలసీ వివరాలు, ఆధారాలను కమిషన్ బెంచ్ పరిశీలించింది. రక్తపోటు ఉండటం వల్లే అతనికి శస్త్రచికిత్స చేశారని చెప్పిన బీమా సంస్థ... అందుకు తగిన ఆధారాలు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించింది. ఫిర్యాదుదారుని వాదనలతో ఏకీభవించిన బెంచ్... ఫిర్యాదుదారునికి ఆస్పత్రిలో ఖర్చయిన రూ.3,50,551లో లక్ష రూపాయలు మినహాయించి మిగతా డబ్బు 9 శాతం వడ్డీతో... పరిహారంగా రూ.2లక్షలు, కేసు ఖర్చుల కింద రూ.5వేలు బాధితునికి చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.
మరో ఘటనలో ఇలాంటి తీర్పు..
వినియోగదారుల కమిషన్ గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి తరహాలోనే తీర్పు వెలువరించింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన విప్పెన్ అగర్వాల్ 2010 నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారు. 2016లో ప్రతివాద సంస్థలో మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నారు. అనంతరం నెలరోజుల వ్యవధిలో బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ... ఒబెసిటీ కారణంగా ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసుకోలేదు. అనంతరం 18 నెలలు గడిచిన తర్వాత విరేచనాలు, న్యూసియా, బీపీ తగ్గిపోవడం తదితర లక్షణాలు ఉండి నీరసంతో కింద పడిపోవడంతో విప్పెన్ తలకి గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిశీలించిన వైద్యులు ‘ఆక్యూట్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్గా నిర్ధారించగా.. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు మెడిక్లెయిమ్ కోసం ప్రయత్నించగా ఒబెసిటీ ఉన్న విషయాన్ని పొందుపరచలేదని బీమా సంస్థ క్లెయిమ్‌ను(Health insurance claim issues) తిరస్కరించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2(district consumer forum case status) అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్.ఎస్.రాజేశ్రీతో కూడిన బెంచ్ బీమా సంస్థ తీరును తప్పు పట్టింది.
'ఆ కారణం చెప్పి బీమాను తిరస్కరించరాదు'
గ్యాస్ట్రో ఎంటెరిటిస్ అంటే జీర్ణకోశం, పేగులకు సంబంధించిన వ్యాధి అని వివరించింది. వైరస్, బ్యాక్టిరియా, పారసైట్, ఫంగస్‌లు కారణంగా ఈ లక్షణాలు ఉంటాయని ఉదరకోశంలో నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయని పేర్కొంది. ఊబకాయంతో ఉండేవారు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. చికిత్సకు అయిన ఖర్చు మొత్తం చెల్లించడంతో పాటు పరిహారం, కేసు ఖర్చులు చెల్లించాలని తీర్పు వెలువరించింది. వైద్య చికిత్సలకు అయిన ఖర్చు మొత్తం 6 శాతం వడ్డీతో రూ.78,305.77, రూ.25 వేలు పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేలు, 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: Nara Rohit on chandrababu incident: 'మా పెద్దమ్మపై నిందలు మోపడానికి నోరెలా వచ్చిందో!'