రంగారెడ్డి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇబ్రహీంపట్నం, మంచాల, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి నిత్య నిరంజన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలకే ఓట్లు వేయాలని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: నేడు మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం