ETV Bharat / state

'ముందు హామీలు నెరవేర్చండి.. తర్వాతే ఓట్లు అడగండి' - నిరుద్యోగ భృతి

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. పట్టభద్రుల సమస్యలపై పోరాడే నాయకుడు కావాలంటే.. కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించాలని నేతలు కోరారు.

congress demands state govt that Fulfill the promises first then asks vote in mlc elections campaign
'ముందు హామీలను నెరవేర్చండి.. తర్వాతే ఓట్లడగండి'
author img

By

Published : Mar 4, 2021, 10:53 PM IST

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మర్చిపోయారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల సమస్యలపై పోరాడే నాయకుడు కావాలంటే.. కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనుభవజ్ఞుడైన చిన్నారెడ్డిని పెద్దల సభకు పంపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని బొంగుళూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకు ఇచ్చిన ఘనత కేసీఆర్​దని ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న తెరాస.. హామీలను నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలని సూచించారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల పోరులో అభ్యర్థుల ఓట్ల వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.