రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్, భూముల కొనుగోలు దారులకు మద్దతుగా విజయవాడ జాతీయ రహదారిపై భాజపా, కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. "ధరణి వద్దు పాత పద్ధతి ముద్దు" అంటూ నిరసన చేపట్టారు. ప్రజలకు చెప్పేది పాత పద్ధతి, రిజిస్ట్రేషన్లు చేసేది కొత్త పద్ధతిలో కావడం వల్ల తీవ్రఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఆందోళనకారులకు ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెనుతిరిగారు.
- ఇదీ చూడండి : భాజపా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్