ETV Bharat / state

శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

chittha
హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ
author img

By

Published : May 16, 2020, 8:34 AM IST

Updated : May 16, 2020, 3:36 PM IST

08:32 May 16

చిరుతను పట్టుకునేందుకు ఉరుకులు పరుగులు

రంగారెడ్డి జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత.. ఈ ఉదయం హిమాయత్ సాగర్ చెరువు వద్ద కనిపించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.  

ఇవాళ ఉదయం మొయినాబాద్​ మండలం అజీజ్ నగర్ గ్రామానికి చెందిన కిష్టయ్య చేపలు పట్టేందుకు హిమాయత్​ సాగర్​కు వెళ్లగా అక్కడ చిరుత కనిపించింది. కిష్టయ్య వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. అతని నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. కిష్టయ్యను వెంటబెట్టుకొని చిరుత కనిపించిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు.  కాలి గుర్తుల ఆధారంగా శంషాబాద్​ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. 

48 గంటలు దాటుతున్న చిరత దొరక్కపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై లారీ డ్రైవర్​పై దాడి చేసినప్పటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 

ఇవీ చూడండి: రహదారులు రక్తసిక్తం.. ముగ్గురి దుర్మరణం..

Last Updated : May 16, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.