రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఉత్సవమూర్తులను గజవాహనంపై ఊరేగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కొద్ది మందిని మాత్రమే ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ పూజారి సీఎస్ రంగారాజన్ తెలిపారు. గజవాహనంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
ఇదీ చదవండి: ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' విజేతల పూర్తి జాబితా