ETV Bharat / state

ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట కుటుంబ సభ్యుల పడిగాపులు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట పిల్లలను ఎత్తుకుని తల్లులు, వారి కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.. ఎందుకనుకుంటున్నారా.. ఆ పిల్లలకు నెల టీకాలు వేయించేందుకని వచ్చారు.. కానీ ఆ ఆసుపత్రి గేటు కూడా తీయలేదు.. ఉదయం 9 గంటలకు రావాల్సిన సిబ్బంది, డాక్టర్లు 10 దాటినా రాలేదు. వచ్చిన వారు తీవ్ర ఆవేదన చెంది వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన నిజాంపేట్​లో జరిగింది.

Mothers' moms in front of a health sub primary center at nizampet
ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట కుటుంబ సభ్యుల పడిగాపులు
author img

By

Published : Mar 4, 2020, 6:14 PM IST

ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. నెల టీకాలు వేసుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన చిన్న పిల్లల తల్లులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది, వైద్యులు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు సేవలు అందించాలి. అందుకు ఓ వైద్యుడు నలుగురు సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ ఒక్కరూ కూడా అందుబాటులో లేరు.

ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉపఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆసుపత్రి వద్ద పసికందులతో మహిళలు, కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వైద్యులు, సిబ్బంది సమయానుకూలంగా ఆసుపత్రికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట కుటుంబ సభ్యుల పడిగాపులు

ఇదీ చూడండి : 'పరీక్షలు రాసేందుకు వెళ్లాలి.. బస్సు సౌకర్యం కల్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.