రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేదలకు సరుకులు అందజేశారు.
కరోనాను అరికట్టేందుకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎంపీ సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, బయటకు వెళ్లిన వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.