కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు చెప్పే మాయమాటలు, అబద్ధపు ప్రచారాలను తెరాస కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. ఆరున్నర సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగ వివరాలను... కేటీఆర్ ఇప్పటికే విడుదల చేశారని తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీ దేవిని గెలిపించాలని... శంషాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో అన్నారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు మార్చి 14న ఓటింగ్‌లో పాల్గొని అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, టీఎస్ఎస్ఐసీ ఛైర్మన్ నాగేందర్ గౌడ్, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్