ETV Bharat / state

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో లేగదూడపై చిరుత దాడి

చిరుత సంచారం ఆ గ్రామాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం ముద్విన్​లో లేగదూడపై పులి దాడి చేసి చంపింది. మూడు నెలలుగా 16 పశువులపై దాడి చేసి చంపినా... అధికారులు బంధించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరుత దాడి
author img

By

Published : May 7, 2019, 10:08 AM IST

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం ముద్విన్​లో లేగదూడపై చిరుత దాడి చేసింది. కొర్షకొండ తండా శివారులో రైతు రాజుకు చెందిన దూడను చంపింది. ఇప్పటివరకూ 16 పశువులను చిరుత హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. కడ్తాల్​, యాచారం, కందుకూరు మండలాల్లో 3 నెలలుగా చిరుత పులి సంచరిస్తున్నా అటవీ అధికారులు బంధించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు.

లేగదూడపై చిరుత దాడి

బోనులు ఏర్పాటు

చిరుత సంచరిస్తున్న మండలాల్లో బోనులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్​కు అనుమతి లభించిందని అటవీ శాఖ రేంజ్​ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే పులిని పట్టుకుంటామన్నారు.

ఇదీ చూడండి : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

Intro:tg_adb_15_06_polling_pkg_c5 ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587 ================.=.=================== (): ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల, మావల, భీంపూర్, తాంసి మండలాల్లో 6 జడ్పీటీసీ, 51 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. మొత్తం 82.13శాతం పోలింగ్ నమోదైంది. ఎండలు సైతం లెక్కచేయకుండా ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలంలో 78.10 శాతం, తాంసి లో 84.34%, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ మండలంలో 81.28శాతం, బేలలో 83.63%, జైనత్ లో 82.92%, మావల మండలంలో 80.74% పోలింగ్ నమోదైంది. మొత్తం 128779 ఓటర్లకుగాను 105766మంది ఓటు వేశారు. తొలి విడతలో 193మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు, 26 మంది జడ్పీటీసీ పదవులకు పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యం ఈ నెల 27న తేలనుంది. అప్పటి వరకు ఓటరు నాడి ఎటు వైపో తెలుసుకొనే ప్రయత్నాల్లో అభ్యర్థులు తలమునకలు కానున్నారు .. ... ...vsss

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.