Chain Snatching Gang Arrest in Rangareddy : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం రంగాపూర్‌కు చెందిన కొనిరెడ్డి వంశీ అనే యువకుడు నగరంలో కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. జల్సాలకు బాగా అలవాటు పడి.. సులభంగా డబ్బులు సంపాదించడానికి గొలుసు దొంగతనాలకు పాల్పడేవాడు. గతంలో నిందితుడు వంశీ వరి ధాన్యం బస్తాలు చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడని.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా తనలో ఎలాంటి మార్పు రాలేదని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. తన స్నేహితులైన కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆశోక్, ఏపీకి చెందిన సాయిరాం, రంగారెడ్డి(Rangareddy) జిల్లాకు చెందిన హరీశ్, దుర్గ అనే నలుగురితో కలిసి గొలుసు దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.
Chain Snatching Gang in Dilsukhnagar : ఈ ఐదుగురు కలిసి నగర శివార్లలోని నందిగామ, మూసాపేట్లో పార్కింగ్ చేసి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. ఆ వాహనాలతో కడ్తాల్, తలకొండపల్లి, జడ్చర్ల, వెల్దండ ప్రాంతాల్లో తిరుగుతూ.. రహదారిపై ఒంటరిగా వెళ్తున్న దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ మెడలో గొలుసు చోరీ(Chain Snatching) చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదుతో దిల్‌సుఖ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 14న మిడ్జల్ నుంచి తలకొండపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ దంపతుల వద్ద నుంచి కూడా గొలుసు చోరీ చేసినట్లు డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఒంటరి మహిళలే టార్గెట్.. రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఒకేరోజు ఆరుచోట్ల..
Bike Theft Gang Arrest in Talakondapally : ఈ రెండు ఫిర్యాదులతో అప్రమత్తమైన పోలీసులు.. నిందితుల కదలికలపై నిఘా పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారని.. మరో ఇద్దరు పరారైనట్లు డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నగరంలో నిఘా లేని ప్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు నిత్యం ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.
"చైన్ స్నాచర్స్, బైక్‌లు దొంగతనం చేస్తున్న గ్యాంగ్‌ను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాం. జులై 30వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ మెడలో నుంచి గొలుసును చోరీ చేశారు. ఆగస్ట్ 14న తలకొండపల్లిలో ఓ దంపతుల వద్ద గొలుసును కొట్టేశారు. ఈ రెండు కేసులు పరిశీలించగా.. అనుమానిత నిందితులపై ఎస్ఓటీ టీం అంతా నిఘా ఉంచారు. కాల్ వివరాల ద్వారా 15 రోజుల తర్వాత నిందితులను పట్టుకున్నాం. వారిపై 5 కేసులు ఉన్నాయి. దొంగిలించిన డబ్బుతో ఓ నిందితుడు కారు కొన్నాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నాం."- నారాయణరెడ్డి, శంషాబాద్ డీసీపీ
Chain Snatching in Bodhan : అలా వచ్చి.. ఇలా దోచుకున్నారు.. తేరుకునేలోపే పరారయ్యారు
Chain Snatching At Hayatnagar : ఒంటరిగా షాప్‌కు వెళ్లితే.. పుస్తెలతాడు చోరీ
LIVE VIDEO: ఒంటరి మహిళలలే టార్గెట్.. గొలుసు ఎత్తుకెళ్లిన చైన్ స్నాచర్స్